హైదరాబాద్: తెలంగాణ టీ20 టోర్నీలో పాల్గొనే రంగారెడ్డి జిల్లా జట్టు కోసం ఆటగాళ్ల ఓపెన్ సెలక్షన్స్ నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా క్రికెట్ అసోసియేన్ కో ఆర్డినేటర్ జితేందర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 30న ఉదయం 8 గంటల నుంచి ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో తెలంగాణ టీ20 క్రికెట్ లీగ్ కోసం ఆటగాళ్ల ఎంపిక ప్రారంభమవుతుందన్నారు. 16 నుంచి 28 సంవత్సరాల వయస్సు కల్గిన రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లా ఆటగాళ్లు ఎంపిక ప్రక్రియకు హాజరు కావచ్చని చెప్పారు. ప్రతీ ఒక్కరు స్థానికతను రుజువు చేసే ఆధార్ కార్డు తీసుకురావాలని ఆయన కోరారు.