
సాక్షి, హైదరాబాద్: బి. వెంకట సుబ్బయ్య స్మారక టెన్నిస్ టోర్నమెంట్‌లో సూర్య పవన్ ఆకట్టుకున్నాడు. గోల్డ్‌స్లామ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఎన్‌వీకే టెన్నిస్ అకాడమీలో జరిగిన ఈ టోర్నీలో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో విజేతగా నిలిచాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో సూర్య పవన్ 8–7తో విశాఖ్‌పై నెగ్గాడు. డబుల్స్ తుదిపోరులో సూర్య పవన్–సూర్య సిరి ద్వయం 8–4తో సమర్ ఖాన్–విశాఖ్ జోడీపై గెలిచింది. 40 ప్లస్ పురుషుల సింగిల్స్‌లో వహీద్ 9–2తో కల్యాణ్ చక్రవర్తిని ఓడించి చాంపియన్‌గా నిలిచాడు. డబుల్స్ టైటిల్‌పోరులోనూ వహీద్–రవీందర్ రెడ్డి జంట 9–2తో కల్యాణ్–వంశీ జోడీపై గెలుపొంది టైటిల్‌ను కైవసం చేసుకుంది.