
రిలయన్స్ స్పోర్ట్స్ సీఓఓగా సుందర్
ఈనెల తొలి వారంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కార్యనిర్వాహణాధికారి (సీఓఓ)పదవికి రాజీనామా చేసిన సుందర్ రామన్.. తాజాగా రిలయన్స్ ఇండస్ట్టీస్ స్పోర్ట్స్ చీఫ్ గా నియమితులయ్యారు.
ముంబై: ఈనెల తొలి వారంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కార్యనిర్వాహణాధికారి (సీఓఓ)పదవికి రాజీనామా చేసిన సుందర్ రామన్.. తాజాగా రిలయన్స్ ఇండస్ట్టీస్ స్పోర్ట్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(రిల్) ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే పలు రకాలైన క్రీడా వ్యాపారాల్లో కీలకంగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పోర్ట్స్ అభివృద్ధిలో భాగంగా సుందర్ రామన్ ను చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా నియమిస్తున్నట్లు పేర్కొంది.
'రిలయన్స్ స్పోర్ట్స్ సీఓఓగా సుందర్ ను నియమించాం. ఇప్పటికే భారత్ లో స్పోర్ట్స్ పెట్టుబడుల్లో ముందు వరుసలో ఉన్న మాకు సుందర్ సేవలు ఉపయోగపడగలవు. రిలయన్స్ స్పోర్ట్స్ ద్వారా మరింత విస్తరించాలనుకుంటున్న మాకు సుందర్ అనుభవం కచ్చితంగా ఉపయోగపడుతుంది. త్వరలో ఆయన రిలయన్స్ స్పోర్ట్స్ సీఓఓగా బాధ్యతలు తీసుకుంటారు' అని రిల్ పేర్కొంది. తనను రిలయన్స్ స్పోర్ట్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా నియమించడం పట్ల చాలా ఆనందంగా ఉందని సుందర్ రామన్ తెలిపాడు. తన ముందున్నది కీలకమైన సవాల్ గా భావించి రిలయన్స్ అభివృద్ధిలో పాలు పంచుకుంటానని పేర్కొన్నాడు.