సౌజన్యకు నిరాశ | Sowjanya Disappointed in Womens Tennis Tourney | Sakshi
Sakshi News home page

సౌజన్యకు నిరాశ

Jun 5 2019 1:54 PM | Updated on Jun 5 2019 1:54 PM

Sowjanya Disappointed in Womens Tennis Tourney - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి సౌజన్య భవిశెట్టికి నిరాశ ఎదురైంది. చైనాలోని షెన్‌జెన్‌ నగరంలో జరుగుతున్న ఈ టోర్నీలో సౌజన్య మెయిన్‌ ‘డ్రా’కు అర్హత సాధించలేకపోయింది. క్వాలిఫయింగ్‌ తొలి రౌండ్‌లో సౌజన్య 6–2, 6–2తో కాట్యా మలికోవా (ఉక్రెయిన్‌)పై గెలిచింది. అయితే నాలుగో సీడ్‌ జెస్సికా హో (అమెరికా)తో జరిగిన రెండో రౌండ్‌ మ్యాచ్‌లో సౌజన్య గాయం కారణంగా మధ్యలోనే వైదొలిగింది. తొలి సెట్‌ను 4–6తో కోల్పోయిన సౌజన్య, రెండో సెట్‌లో 1–4తో వెనుకబడిన దశలో గాయం కావడంతో ఆమె తప్పుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement