సౌత్ జోన్ అండర్-19 మహిళల వన్డే టోర్నమెంట్‌లో హైదరాబాద్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఆడిన ఐదు లీగ్ మ్యాచ్‌ల్లో నాలుగింటిలో హైదరాబాద్ జట్టు విజయాలు సాధించింది.
గుంటూరు స్పోర్ట్స్, న్యూస్‌లైన్: సౌత్ జోన్ అండర్-19 మహిళల వన్డే టోర్నమెంట్‌లో హైదరాబాద్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఆడిన ఐదు లీగ్ మ్యాచ్‌ల్లో నాలుగింటిలో హైదరాబాద్ జట్టు విజయాలు సాధించింది.
స్థానిక పేరేచర్ల క్రికెట్ గ్రౌండ్‌లో శనివారం జరిగిన తమ చివరి మ్యాచ్‌లో హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో గోవా జట్టుపై ఘన విజయం సాధించింది. 108 పరుగుల విజయ లక్ష్యాన్ని 22.1 ఓవర్లలోనే వికెట్ నష్టపోయి అందుకుంది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన గోవా 46 ఓవర్లలో 107 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మరోవైపు ఓటమనేది లేకుండా ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన ఆంధ్రా జట్టు విజేతగా నిలిచింది. బెస్ట్ బ్యాట్స్ ఉమన్‌గా టోర్నీలో అత్యధికంగా 192 పరుగులు చేసిన హైదరాబాద్ బ్యాట్స్ ఉమన్‌గా స్నేహ ఎంపికైంది. బెస్ట్ బౌలర్‌గా హైదరాబాద్ బౌలర్ ఎం.భోగి ఎంపికైంది.