అంతర్జాతీయ క్రికెట్‌కు అఫ్రిది వీడ్కోలు | Shahid Afridi announces international retirement | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ క్రికెట్‌కు అఫ్రిది వీడ్కోలు

Feb 20 2017 7:18 AM | Updated on Sep 5 2017 4:11 AM

అంతర్జాతీయ క్రికెట్‌కు అఫ్రిది వీడ్కోలు

అంతర్జాతీయ క్రికెట్‌కు అఫ్రిది వీడ్కోలు

పాకిస్తాన్‌ లెజెండరీ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రిది(36) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ లెజెండరీ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రిది(36) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 21 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌ను ముగిస్తున్నట్లు అఫ్రిది ఆదివారం ప్రకటించాడు. టెస్ట్‌, వన్డే క్రికెట్‌ నుంచి గతంలోనే తప్పుకున్న ఈ క్రికెటర్‌.. తాజాగా టీ20 జట్టు నుంచి తప్పుకొని అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌ను ముగించాడు.

1996లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన అఫ్రిది.. తానాడిన రెండో వన్డెలోనే శ్రీలంకపై కేవలం 37 బంతుల్లో సెంచరీ సాధించి ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించాడు. టెస్ట్‌ కెరీర్‌లో 27 మ్యాచ్‌ల్లో 1,176 పరుగులతో పాటు, 48 వికెట్లు సాధించిన అఫ్రిది.. వన్డేల్లో 398 మ్యాచ్‌ల్లో 8,064 పరుగులు, 395 వికెట్లు సాధించాడు. ఇక టీ20 పార్మాట్‌లో 98 మ్యాచ్‌లు ఆడి 1,405 పరుగులు, 97 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement