నా వెంట కోచ్‌గా విమల్‌ను పంపండి | send coach along with me | Sakshi
Sakshi News home page

నా వెంట కోచ్‌గా విమల్‌ను పంపండి

Sep 11 2014 1:04 AM | Updated on Sep 2 2017 1:10 PM

నా వెంట కోచ్‌గా విమల్‌ను పంపండి

నా వెంట కోచ్‌గా విమల్‌ను పంపండి

న్యూఢిల్లీ: ఆసియా క్రీడల కోసం తనతో పాటు కోచ్ విమల్ కుమార్‌ను కూడా ఇంచియాన్‌కు పంపించాలని స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్... భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్)కు విజ్ఞప్తి చేసింది.

న్యూఢిల్లీ: ఆసియా క్రీడల కోసం తనతో పాటు కోచ్ విమల్ కుమార్‌ను కూడా ఇంచియాన్‌కు పంపించాలని స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్... భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్)కు విజ్ఞప్తి చేసింది. ఇందుకోసం కోచ్‌ల జాబితాలో ఆయన పేరును కూడా చేర్చాలని కోరింది. అయితే ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు తెలియజేశామని, వాళ్ల నిర్ణయం కోసం వేచి చూస్తున్నామని ‘బాయ్’ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ‘మొదట గోపీచంద్, మధుమిత బిస్త్, విజయ్‌దీప్ సింగ్‌లను పంపాలని అనుకున్నాం. కానీ ఇప్పుడు విమల్ పేరును చేర్చాల్సి వచ్చింది. ఓ క్రీడా విశ్లేషకుడిని తగ్గించి జాబితాను సర్దుబాటు చేయాలి. పక్కపక్క కోర్టుల్లో ఒకేసారి మ్యాచ్‌లు అడుతున్నప్పుడు అదనపు కోచ్ ఉండటం లాభిస్తుంది’ అని సదరు అధికారి పేర్కొన్నారు. కారణాలు ఏమైనా... ప్రపంచ చాంపియన్‌షిప్ తర్వాత చీఫ్ కోచ్ గోపీచంద్ నుంచి విడిపోయిన సైనా గత వారం నుంచి విమల్ వద్ద ప్రాక్టీస్ చేస్తున్న సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement