ఫైనల్లో సౌరభ్ వర్మ | Saurabh Verma enters in finals | Sakshi
Sakshi News home page

ఫైనల్లో సౌరభ్ వర్మ

Mar 30 2014 1:49 AM | Updated on Sep 2 2017 5:20 AM

ఫైనల్లో సౌరభ్ వర్మ

ఫైనల్లో సౌరభ్ వర్మ

భారత బ్యాడ్మింటన్ యువతార సౌరభ్ వర్మ మలేసియా ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరగాల్సిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో రెండో సీడ్ వీ ఫెంగ్ చోంగ్ (మలేసియా) గాయం కారణంగా బరిలోకి దిగలేదు.

మలేసియా గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీ
 జొహర్ బారు: భారత బ్యాడ్మింటన్ యువతార సౌరభ్ వర్మ మలేసియా ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరగాల్సిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో రెండో సీడ్ వీ ఫెంగ్ చోంగ్ (మలేసియా) గాయం కారణంగా బరిలోకి దిగలేదు. దీంతో మధ్యప్రదేశ్‌కు చెందిన సౌరభ్‌కు వాకోవర్ లభించింది.
 
 ఆదివారం జరిగే ఫైనల్లో సౌరభ్... సిమోన్ సాంటోసో (ఇండోనేసియా)తో తలపడతాడు. ఇప్పటి వరకు ఈ ఇద్దరి మధ్య జరిగిన ఒకే ఒక్క మ్యాచ్ (2012 ఇండోనేసియా ఓపెన్)లో సాంటోసో వరుస గేముల్లో  నెగ్గాడు. గోపీచంద్, అరవింద్ భట్, శ్రీకాంత్ తర్వాత భారత్ నుంచి విదేశీగడ్డపై గ్రాండ్‌ప్రి గోల్డ్ స్థాయి టోర్నీలో ఫైనల్‌కు చేరుకున్న నాలుగో క్రీడాకారుడిగా సౌరభ్ వర్మ గుర్తింపు పొందాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement