ఏడాది తర్వాతైనా సైనా ఆశ నెరవేరేనా..? | Saina Nehwal looks for Hong Kong Super Series | Sakshi
Sakshi News home page

ఏడాది తర్వాతైనా సైనా ఆశ నెరవేరేనా..?

Nov 18 2013 4:41 PM | Updated on Sep 2 2018 3:17 PM

ఏడాది తర్వాతైనా సైనా ఆశ నెరవేరేనా..? - Sakshi

ఏడాది తర్వాతైనా సైనా ఆశ నెరవేరేనా..?

భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ టైటిల్ నెగ్గి ఏడాదికి పైగా కావస్తోంది. ఈ సీజన్లో గాయాలు, ఫామ్లేమితో సతమతమవుతున్న సైనా మరో పోరాటానికి సన్నద్ధమైంది.

భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ టైటిల్ నెగ్గి ఏడాదికి పైగా కావస్తోంది. ఈ సీజన్లో గాయాలు, ఫామ్లేమితో సతమతమవుతున్న సైనా మరో పోరాటానికి సన్నద్ధమైంది. బుధవారం ఆరంభమయ్యే హాంకాంగ్ సూపర్ సిరీస్లో హైదరాబాదీ బరిలోకి దిగుతోంది. సీజన్ చివర్లో కనీసం ఈ టైటిల్ను అయినా నెగ్గాలని సైనా ఎదురు చూస్తోంది. సైనా చివరిసారిగా 2012 అక్టోబర్లో జరిగిన డెన్మార్క్ ఓపెన్ టైటిల్ను గెలిచింది.

తాజా టోర్నీ తొలిరౌండ్లో ఏడోసీడ్, హైదరాబాదీ మనుపుట్టి (ఇండోనేసియా)తో తలపడనుంది. ఆ తర్వాత టాప్సీడ్లతో సవాల్ ఎదురుకానుంది. ఇక యువసంచలనం, పదో ర్యాంకర్ పీవీ సింధుకు తొలిరౌండ్లో రెండో సీడ్ రట్చనోక్ ఇంటనోన్ రూపంలో గట్టిపోటీ ఎదురైంది. ఈ టోర్నీలో భారత షట్లర్లు పారుపల్లి కశ్యప్, అజయ్ జయరామ్, శ్రీకాంత్, ఆనంద్ పవార్, గుత్తా జ్వాల, అశ్వినీ పొన్నప్ప బరిలోకి దిగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement