కోహ్లీ రికార్డును బ్రేక్‌ చేసిన రోహిత్‌ | Rohith breaks Kohli record in T20s | Sakshi
Sakshi News home page

కోహ్లీ రికార్డును బ్రేక్‌ చేసిన రోహిత్‌

Nov 6 2018 7:21 PM | Updated on Nov 6 2018 8:39 PM

Rohith breaks Kohli record in T20s - Sakshi

లక్నో: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తనదైన మార్కుతో దూసుకుపోతున్న టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ మరో రికార్డు నెలకొల్పాడు. అంతర‍్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాడిగా నిలిచాడు. విరాట్‌ కోహ్లి పేరిట ఉన్న రికార్డును రోహిత్‌ బ్రేక్‌ చేశాడు. వెస్టిండీస్‌ జరుగుతున్న రెండో టీ20లో కోహ్లి(2,102)ని రోహిత్‌ అధిగమించాడు. ఈ సిరీస్‌లో విరాట్‌ కోహ్లికి విశ్రాంతినివ్వడంతో రోహిత్‌ శర్మ జట్టు భారత క్రికెట్‌ జట్టు పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తొలి వన్డేలో గెలిచిన రోహిత్‌ బృందం.. రెండో టీ20లో సైతం గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది.

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో న్యూజిలాండ్‌ క్రికెటర్‌ మార్టిన్ గప్తిల్ 2,271 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా. రోహిత్‌ శర్మ(2,203) రెండో స్థానంలో ఉన్నాడు. పాకిస్తాన్‌ సీనియర్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ 2,171 పరుగులతో మూడో స్థానంలో, న్యూజిలాండ్‌కు చెందిన మాజీ క్రికెటర్‌ మెకల్లమ్‌ 2,140 పరుగులతో నాలుగో స్థానంలో ఉండగా, కోహ్లి ఐదో స్థానంలో ఉన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement