ఉత్తమ గోల్ఫ్‌ ప్లేయర్‌గా రవి | Ravi gets best Golf Player Award | Sakshi
Sakshi News home page

ఉత్తమ గోల్ఫ్‌ ప్లేయర్‌గా రవి

Nov 19 2018 10:27 AM | Updated on Nov 19 2018 10:27 AM

Ravi gets best Golf Player Award - Sakshi

తార్నాక: టెట్రాసాఫ్ట్‌ టెక్నాలజీ కన్సల్టింగ్‌ సర్వీసెస్‌ సంస్థ ఆధ్వర్యంలో తార్నాక రైల్వే గోల్ఫ్‌ క్లబ్‌ వేదికగా జరిగిన ప్రిన్స్‌ వింటర్‌ గోల్ఫ్‌ టోర్నీ ఆదివారంతో ముగిసింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ టోర్నీలో 50 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో నెట్, గ్రాస్, స్టేబుల్‌ ఫోర్ట్‌ విభాగాల్లో పోటీలను నిర్వహించారు. పోటీల్లో భాగంగా అన్ని కేటగిరీలలో లాంగెస్ట్‌ డ్రైవ్, నియరెస్ట్‌ పిన్‌ విధానాన్ని పాటించారు. మహిళల విభాగంలో ప్రత్యేకం గా పోటీలు జరిగాయి. దక్షిణ మధ్య రైల్వేకు చెందిన రవి బెస్ట్‌ గోల్ఫ్‌ ప్లేయర్‌ అవార్డును అందుకున్నాడు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో టెట్రాసాఫ్ట్‌ టెక్నాలజీ కన్సల్టింగ్‌ సర్వీసెస్‌ సంస్థ ప్రతినిధి జయపాల్‌రెడ్డి, దక్షిణమధ్య రైల్వే స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు అర్జున్‌ ముండియా అతిథులుగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement