రష్మికకు నిరాశ | Rashmika disappointed after losing qualifier tourney of French Open | Sakshi
Sakshi News home page

రష్మికకు నిరాశ

May 28 2018 10:50 AM | Updated on May 28 2018 10:50 AM

Rashmika disappointed after losing qualifier tourney of French Open - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జూనియర్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ టోర్నీకి క్వాలిఫయర్‌గా నిర్వహించిన రోలాండ్‌ గారోస్‌ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ టెన్నిస్‌ టోర్నీలో తెలంగాణ రాష్ట్ర క్రీడాకారిణి శ్రీవల్లి రష్మికకు నిరాశ ఎదురైంది. ఈ క్వాలిఫయింగ్‌ టోర్నీలో సత్తా చాటి జూనియర్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఆడాలన్న ఆమె ఆశలు ఆవిరయ్యాయి. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ పొందడానికి 2 మ్యాచ్‌లు గెలవాల్సి ఉండగా ఆమె ఒకే మ్యాచ్‌లో గెలుపొంది అద్భుత అవకాశాన్ని చేజార్చుకుంది.

పారిస్‌లో జరిగిన ఈ టోర్నీ తొలిరౌండ్‌లో రష్మిక (భారత్‌) 6–3, 6–2తో కావో షి (చైనా)పై విజయం సాధించి శుభారంభం చేసిం ది. కానీ రెండో రౌండ్‌లో రష్మిక 5–7, 4–6తో అనా పౌలా మెలిలో (బ్రెజిల్‌) చేతిలో ఓడిపోయి పోటీ నుంచి నిష్క్రమించింది. మూడో రౌండ్‌లో అనా పౌలా (బ్రెజిల్‌) 7–6 (7/4), 6–2తో కావో షి (చైనా)పై నెగ్గి వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా జూనియర్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌కు అర్హత సాధించింది.       

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement