ధోని చెప్పిందొకటి.. రైనా చేసిందొకటి! | Raina trolled by Netizens for not hearing Dhoni words | Sakshi
Sakshi News home page

ధోని చెప్పిందొకటి.. రైనా చేసిందొకటి!

Feb 28 2018 2:35 PM | Updated on Feb 28 2018 2:35 PM

Raina trolled by Netizens for not hearing Dhoni words - Sakshi

మహేంద్ర సింగ్ ధోని, సురేశ్ రైనా

కేప్‌టౌన్: ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌ను టీమిండియా 2-1తో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, జట్టు ఆటగాడు సురేశ్ రైనాకు ఇచ్చిన సూచనలు పాటించక పోవడంతో మిస్ ఫైర్ అయిందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ధోని చెప్పిన దానికి వ్యతిరేకంగా రైనా బౌలింగ్ చేసి మూల్యం చెల్లించుకున్నట్లు ట్వీట్లు వస్తున్నాయి.

చివరి టీ20లో దక్షిణాఫ్రికా ఛేజింగ్ చేయగా.. ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేసిన అక్షర్ పటేల్ 16 పరుగులు ఇచ్చాడు. ఆ మరుసటి ఓవర్ రైనా బౌలింగ్ చేశాడు. తొలి 3 బంతులకు కేవలం మూడు పరుగులే ఇచ్చిన రైనాకు మిస్టర్ కూల్ ధోని కొన్ని సూచనలు ఇచ్చినట్లు స్టంప్ మైక్‌లో రికార్డయింది. ‘ఫాస్ట్‌గా బౌల్ చేయొద్దు.. కానీ వికెట్లకు నేరుగా బౌలింగ్ చేయ్ అంటూ’ ధోని మూడుసార్లు చెప్పినా రైనా అలా కాకుండా వేగంగా బంతులు సంధించాడు. దీంతో దక్షిణాఫ్రికా అరంగ్రేట ఆటగాడు జాంకర్ వరుస బౌండరీలు బాదాడు. ధోని మాట వినకపోవడం వల్లే రైనా బౌలింగ్‌ను సఫారీ క్రికెటర్ ఆటాడుకున్నాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

కాగా, ఇటీవల మరో మ్యాచ్‌లో మనీశ్ పాండే ఎక్కడో చూస్తూ.. కాస్త ఉదాసీనత ప్రదర్శించగా.. అక్కడ ఏం చూస్తావ్.. ఇటువైపు చూడంటూ ధోని ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement