రైనా ‘స్వచ్ఛ భారత్’ | Raina completes PM Modi's Swacch Bharat Challenge | Sakshi
Sakshi News home page

రైనా ‘స్వచ్ఛ భారత్’

Nov 20 2014 12:12 AM | Updated on Sep 2 2017 4:45 PM

రైనా ‘స్వచ్ఛ భారత్’

రైనా ‘స్వచ్ఛ భారత్’

ప్రధాని మోదీ పిలుపు మేరకు ‘స్వచ్ఛ భారత్’లో పాల్గొంటున్న ప్రముఖులలో ఇప్పుడు భారత క్రికెటర్ సురేశ్ రైనా కూడా చేరాడు.

ఘజియాబాద్: ప్రధాని మోదీ పిలుపు మేరకు ‘స్వచ్ఛ భారత్’లో పాల్గొంటున్న ప్రముఖులలో ఇప్పుడు భారత క్రికెటర్ సురేశ్ రైనా కూడా చేరాడు. బుధవారం రైనా తన స్వస్థలం ఘజియాబాద్‌లో స్థానికులు, చిన్నారులతో కలిపి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడడు. రైనా పేరును స్వయంగా మోదీనే ప్రతిపాదించడం విశేషం. ‘స్వచ్ఛ భారత్ కార్యక్రమం దేశభక్తికి ప్రతీక. శుభ్రత అనేది మన సంస్కృతిని ప్రతిబింబిస్తుంది.

ఇది కలగా మిగిలిపోకూడదు. నా వంతుగా సవాల్‌ను పూర్తి చేసినందుకు సంతోషంగా ఉంది’ అని రైనా వ్యాఖ్యానించాడు. స్వచ్ఛ భారత్ కొనసాగింపు కోసం సహచర యూపీ క్రికెటర్లు ప్రవీణ్ కుమార్, పీయూష్ చావ్లా, ఆర్పీ సింగ్‌లతో పాటు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, హాకీ ఆటగాడు శ్రీజేశ్, సోనూ నిగం, శ్రేయా ఘోషల్, సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌ల పేర్లను రైనా ప్రతిపాదించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement