'గోపీచంద్ అకాడమీకి వచ్చి వెళ్లిపోయారు' | pullela gopichand committed to badminton, says his wife Lakshmi | Sakshi
Sakshi News home page

'గోపీచంద్ అకాడమీకి వచ్చి వెళ్లిపోయారు'

Aug 19 2016 1:58 PM | Updated on Sep 4 2017 9:58 AM

'గోపీచంద్ అకాడమీకి వచ్చి వెళ్లిపోయారు'

'గోపీచంద్ అకాడమీకి వచ్చి వెళ్లిపోయారు'

ఆరేడేళ్లుగా బ్యాడ్మింటన్ కు క్రేజ్ పెరిగిందని పుల్లెల గోపీచంద్ సతీమణి పీవీవీ లక్ష్మి అన్నారు.

హైదరాబాద్: ఆరేడేళ్లుగా బ్యాడ్మింటన్ కు క్రేజ్ పెరిగిందని పుల్లెల గోపీచంద్ సతీమణి పీవీవీ లక్ష్మి అన్నారు. గోపీచంద్ శిష్యురాలు పీవీ సింధు రియో ఒలింపిక్స్ లో పతకం ఖాయం చేసుకున్న నేపథ్యంలో 'సాక్షి' టీవీతో ఆమె మాట్లాడారు. సైనా నెహ్వాల్, కశ్యప్, శ్రీకాంత్, గుత్తా జ్వాల, సింధు కారణంగా బ్యాడ్మింటన్ కు ఆదరణ పెరిగిందన్నారు. ఇంకా ప్రమాణాలు పెరగాల్సివుందని అభిప్రాయపడ్డారు.

'ఇంకా మనం చదువుల పట్లే మోజు చూపుతున్నాం. తాజా విజయాలు క్రీడలవైపు పిల్లలను మళ్లిస్తాయి. ఇప్పుడు స్పోర్ట్స్ మెడిసిన్, అత్యాధునిక పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. చాలా మంది గోపీచంద్ అకాడమీకి వచ్చి వెళ్లిపోయారు. అది వారి వ్యక్తిగత నిర్ణయం. కానీ ఎవరు ఆడిన ఆయన సహాయపడతారు. గోపీకి తెలిసిన మంత్రం ఇదొక్కటే. కఠోరశ్రమ, అంకితభావం ఆయన సొంతం. జీవిత భాగస్వామిగా ఆయనలో నేను ఇదే చూశాన'ని లక్ష్మి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement