పాక్, కివీస్ రెండో టెస్టు డ్రా | Pakistan vs New Zealand, 2nd Test draw | Sakshi
Sakshi News home page

పాక్, కివీస్ రెండో టెస్టు డ్రా

Nov 22 2014 12:53 AM | Updated on Sep 2 2017 4:52 PM

పాకిస్థాన్, న్యూజిలాండ్‌ల మధ్య ఆసక్తికరంగా సాగిన రెండో టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మిస్బాసేన 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.

దుబాయ్: పాకిస్థాన్, న్యూజిలాండ్‌ల మధ్య ఆసక్తికరంగా సాగిన రెండో టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మిస్బాసేన 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. కివీస్ నిర్దేశించిన 261 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు శుక్రవారం ఆఖరి రోజు బరిలోకి దిగిన పాక్ రెండో ఇన్నింగ్స్‌లో 67 ఓవర్లలో 5 వికెట్లకు 196 పరుగులు చేసింది.

షాన్ మసూద్ (40), యూనిస్ ఖాన్ (44), అసద్ షఫీక్ (41 నాటౌట్) రాణించారు. అంతకుముందు 167/6 ఓవర్‌నైట్ స్కోరుతో ఐదో రోజు ఆట కొనసాగించిన కివీస్ రెండో ఇన్నింగ్స్‌ను 64.5 ఓవర్లలో 9 వికెట్లకు 250 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ టేలర్ (104) సెంచరీ సాధించగా... క్రెయిగ్ (34) ఫర్వాలేదనిపించాడు. మూడో టెస్టు 26 నుంచి జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement