భారత మహిళా స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌కు ‘ఓజీక్యూ’ చేయూత 

Olympic Gold Quest will be co-owned by Vinay Fogat - Sakshi

భారత మహిళా స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌కు ఒలింపిక్‌ గోల్డ్‌ క్వెస్ట్‌ (ఓజీక్యూ) సహకారం అందించనుంది. 2020లో జరిగే టోక్యో ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్న వినేశ్‌కు అంతర్జాతీయ స్థాయి శిక్షణ, సౌకర్యాలు కల్పించనున్నట్లు ఆ సంస్థ  పేర్కొంది. టోక్యో ఒలింపిక్స్‌లో వినేశ్‌ కచ్చితంగా పతకం సాధిస్తుందని ఆ సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది.

50 కేజీల విభాగంలో పోటీ పడుతున్న 23 ఏళ్ల వినేశ్‌ ఇటీవల జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో రజతం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె మాట్లడుతూ... ‘టోక్యో ఒలింపిక్స్‌లో దేశం తరఫున పతకం గెలవాలని కృత నిశ్చయంతో ఉన్నా. నా లక్ష్యానికి ఒలింపిక్‌ గోల్డ్‌ క్వెస్ట్‌ ఎంతగానో సహకరిస్తోంది’ అని వినేశ్‌ తెలిపింది.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top