మిస్టర్ కూల్.. ధోని కాదట! | Not MS Dhoni, but THIS is the 'calmest man alive' according to Trent Boult | Sakshi
Sakshi News home page

మిస్టర్ కూల్.. ధోని కాదట!

Jun 5 2017 2:31 PM | Updated on Sep 5 2017 12:53 PM

మిస్టర్ కూల్.. ధోని కాదట!

మిస్టర్ కూల్.. ధోని కాదట!

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి పర్యాయపదం ఏదైనా ఉందంటే అది మిస్టర్ కూల్.

లండన్: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి పర్యాయపదం ఏదైనా ఉందంటే అది మిస్టర్ కూల్. ఒత్తిడి సమయాల్లో మ్యాచ్ లను కూల్ గా ఫినిష్ చేసే క్రమంలో ధోనికి మిస్టర్ కూల్ అనే ట్యాగ్ ను యాడ్ చేశారు. అయితే ప్రపంచ క్రికెట్ లో ధోని మిస్టర్ కూల్ కాదని అంటున్నాడు న్యూజిలాండ్ ప్రధాన పేసర్ ట్రెంట్ బౌల్ట్. అసలు ధోని 'కామెస్ట్' క్రికెటర్ కాదని బౌల్ట్ అభిప్రాయపడ్డాడు. కాగా, ఇందుకు తగిన వ్యక్తి మరొకరున్నారంటూ తమ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ పేరును సూచించాడు.

'నా ప్రకారం చూస్తే ధోని కామెస్ట్ క్రికెటర్ కాదు. కేన్ విలియమ్సనే అందుకు అన్ని విధాలా అర్హడు. ఫీల్డ్ లో తన పనిని చాలా కూల్ గా ముగించడంలో విలియమ్సన్ సిద్ధహస్తుడు. నా వరకూ అయితే ప్రపంచ క్రికెట్ లో మిస్టర్ కూల్ ఎవరైనా ఉన్నారంటే అది విలియమ్సన్ ఒక్కడే' అని బౌల్ట్ పేర్కొన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement