సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక వరల్డ్ స్కేట్ గేమ్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ అమ్మాయి మండెపూడి చరితశ్రీ మెరిపించింది. పరాగ్వేలో జరుగుతున్న ఈ చాంపియన్షిప్లో చరితశ్రీ, రుత్వా ప్రకాశ్, ప్రగతి శివబాలన్, లక్షిత సింధు బృందం కాంస్య పతకం సాధించింది. జూనియర్ మహిళల 3000 మీటర్ల రిలే రేసును చరితశ్రీ, రుత్వా, ప్రగతి, లక్షిత జట్టు 4 నిమిషాల 34.659 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచింది.
15 ఏళ్ల చరితశ్రీ కొన్నేళ్లుగా జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తూ ఇప్పటి వరకు 18 స్వర్ణ పతకాలు నెగ్గింది. కొలంబియా జట్టు (4ని:22.116 సెకన్లుల) స్వర్ణం... ఈక్వెడార్ జట్టు (4ని:25.889 సెకన్లు) రజత పతకం సాధించాయి. ఈనెల 18 వరకు జరిగే ఈ క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు రెండు రజతాలు, రెండు కాంస్య పతకాలు సొంతం చేసుకొని నాలుగు పతకాలతో 21వ స్థానంలో ఉంది.


