భారత్‌కు అప్పుల గుబులు | Report by the United Nations Economic Division | Sakshi
Sakshi News home page

భారత్‌కు అప్పుల గుబులు

Oct 15 2026 3:47 AM | Updated on Oct 15 2026 3:47 AM

Report by the United Nations Economic Division

దేశ అప్పుల భారం రూ.315 లక్షల కోట్లు

వర్థమాన దేశాలదీ అదే తీరు 

2025లో వడ్డీలకే రూ.95 లక్షల కోట్లు

విద్య, వైద్య రంగాల వ్యయం కంటే అధికం

ఐక్యరాజ్య సమితి ఆర్థిక విభాగం నివేదిక

సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా వర్థమాన (అభివృద్ధి చెందుతున్న) దేశాలను అప్పుల భారం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. విద్య, వైద్య మౌలిక వసతుల కల్పన కంటే అప్పులపై వడ్డీల కోసమే ఏటా అధికంగా వెచ్చించాల్సి వస్తోంది. 2025 నాటికి భారత్‌పై ఉన్న మొత్తం అప్పుల భారం ఏకంగా రూ. 315 లక్షల కోట్లకు చేరిందని ఐక్యరాజ్యసమితికి చెందిన ‘కాన్ఫరెన్స్‌ ఆన్‌ ట్రేడ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌’ (యూఎన్‌సీటీడీ) నివేదిక వెల్లడించింది. గడిచిన 15 ఏళ్లలో ఈ అప్పులు అమాంతం పెరిగాయని, వర్థమాన దేశాల ప్రగతికి ఇది పెద్ద సవాలుగా మారిందని స్పష్టం చేసింది. యూఎన్‌సీటీడీ నివేదికలో ఏముందంటే...

» ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు అప్పులపై వడ్డీల కోసమే 2025లో రూ.95లక్షల కోట్లు వెచ్చించాయి. 2010లో వర్థమాన దేశాలు అప్పులపై వడ్డీల భారం రూ.34.50 లక్షల కోట్లు...కాగా 2025 నాటికి రూ.95 లక్షల కోట్లకు పెరిగాయి.
»  51 వర్థమాన దేశాలు విద్య, వైద్య రంగంపై కంటే అప్పులకు వడ్డీల చెల్లింపు కోసమే ఎక్కువ బడ్జెట్‌ను కేటాయించాల్సి వస్తోంది. 
» అధిక వడ్డీ రేట్ల కారణంగా వర్థమాన దేశాలు ఏటా రూ.47,614 కోట్లు అధిక భారాన్ని భరించాల్సి వస్తోంది. ఆ మొత్తంతో 13 లక్షల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయవచ్చు. 16లక్షల మంది బాలలకు పౌష్టికాహారాన్ని అందించవచ్చని యూఎన్‌సీ­టీడీ నివేదిక పేర్కొంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement