టైటిల్‌ పోరుకు నిధి, సోహా | Nidhi, Saho to Final Fight of AITA Tournament | Sakshi
Sakshi News home page

టైటిల్‌ పోరుకు నిధి, సోహా

Mar 9 2019 10:07 AM | Updated on Mar 9 2019 10:07 AM

Nidhi, Saho to Final Fight of AITA Tournament - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) పురుషుల, మహిళల ఓపెన్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారులు నిధి చిలుముల, షేక్‌ హుమేరా, సారా యాదవ్‌ నిలకడగా రాణిస్తున్నారు. పుణేలో జరుగుతోన్న ఈ టోర్నీలో నిధి సింగిల్స్‌ విభాగంలో... షేక్‌ హుమేరా–సారా యాదవ్‌ ద్వయం డబుల్స్‌ కేటగిరీలలో ఫైనల్‌కు చేరుకున్నారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీస్‌లో ఏడో సీడ్‌ నిధి చిలుముల (తెలంగాణ) 7–6 (9/7), 6–4తో టాప్‌ సీడ్‌ వైదేహి చౌదరీ (గుజరాత్‌)కి షాకిచ్చింది.

మరో మ్యాచ్‌లో నాలుగో సీడ్‌ సోహా సాధిక్‌ (ఆంధ్రప్రదేశ్‌) 6–3, 6–2తో రెండో సీడ్‌ నిత్యరాజ్‌ బాబురాజ్‌ (తమిళనాడు)ను కంగుతినిపించింది. మరోవైపు మహిళల డబుల్స్‌ సెమీస్‌ మ్యాచ్‌లో షేక్‌ హుమేరా–సారా యాదవ్‌ ద్వయం 6–3, 6–4తో సాయి–ఆర్తి జంటపై గెలుపొందగా... అనూష కొండవీటి–సాయిదేదీప్య జంట 1–6, 1–6తో శ్రావ్య చిలకలపూడి–వైదేహి చౌదరీ జంట చేతిలో ఓటమి పాలైంది.

Advertisement
 
Advertisement
Advertisement