చెంగ్డూ ఓపెన్‌ రన్నరప్‌ జీవన్‌ జంట | Nedunchezhiyan-Krajicek pair goes down in straight sets | Sakshi
Sakshi News home page

చెంగ్డూ ఓపెన్‌ రన్నరప్‌ జీవన్‌ జంట

Oct 1 2018 5:57 AM | Updated on Apr 4 2019 3:25 PM

Nedunchezhiyan-Krajicek pair goes down in straight sets - Sakshi

జీవన్‌ నెడుంజెళియన్‌

కెరీర్‌లో రెండో ఏటీపీ టోర్నమెంట్‌ డబుల్స్‌ టైటిల్‌ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్‌ క్రీడాకారుడు జీవన్‌ నెడుంజెళియన్‌కు నిరాశ ఎదురైంది. ఆదివారం చైనాలో ముగిసిన చెంగ్డూ ఓపెన్‌లో జీవన్‌–ఆస్టిన్‌ క్రాయిసెక్‌ (అమెరికా) జంట రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో జీవన్‌–ఆస్టిన్‌ ద్వయం 2–6, 4–6తో టాప్‌ సీడ్‌ ఇవాన్‌ డోడిగ్‌–మ్యాట్‌ పావిక్‌ (క్రొయేషియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. రన్నరప్‌ జీవన్‌–ఆస్టిన్‌ జంటకు 30,490 డాలర్ల (రూ. 22 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 150 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement