'నా జూదం ఫలించలేదు' | my plan didn't work fully, viswanathan anand | Sakshi
Sakshi News home page

'నా జూదం ఫలించలేదు'

Nov 24 2014 9:27 AM | Updated on Sep 2 2017 5:03 PM

'నా జూదం ఫలించలేదు'

'నా జూదం ఫలించలేదు'

ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్‌ను దక్కించుకోవాలనుకున్న కలలు కల్లలు కావడంతో భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తన ఆటపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.

సోచి: ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్‌ను దక్కించుకోవాలనుకున్నకలలు కల్లలు కావడంతో  భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తన ఆటపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. 'చాలా ఉద్వేగభరిత క్షణాలు అవి. 27వ ఎత్తును బీజీ7 వేస్తే పరిస్థితి సమంగా ఉండేది. అయితే నా జూదం ఫలించలేదు. అందుకు తగిన శిక్ష పడింది. ఒత్తిడిలో తీసుకున్న నిర్ణయమది. మొత్తంగా చూస్తే నల్ల పావులతో నేను బాగానే ఆడాను. అయితే మాగ్నస్ కార్ల్ సన్ మెరుగ్గా ఆడాడని అంగీకరించాలి' ఆనంద్ తెలిపాడు.

 

అతను ఒత్తిడిని తనకంటే బాగా ఎదుర్కొన్నాడని,. అతనితో పోలిస్తే ఎక్కువ సార్లు తానే బలహీనంగా కనిపించానన్నాడు. ఈ ఓటమితో తాను చెస్ మానేయాలని అనుకోవడం లేదని ఆనంద్ తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement