
న్యూఢిల్లీ: మహేంద్ర సింగ్ ధోనికి ఎప్పుడు రిటైర్ అవ్వాలో తెలుసని భారత ఓపెనర్ శిఖర్ ధావన్ అన్నాడు. ‘భారత జట్టును ప్రపంచంలో అత్యుత్తమంగా నిలిపిన ధోని సమయం వచ్చినపుడు రిటైర్మెంట్ ప్రకటిస్తాడు. దాని గురించి చర్చ అనవసరం. ఆటగాడి నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టడం ధోనికి తెలిసినంతగా మరెవరికీ తెలియదు. అది నాయకుడి ముఖ్య లక్షణం. జట్టులోకి వచ్చిన తొలినాళ్లలో కోహ్లికి ధోని మార్గనిర్దేశం చేశాడు. కోహ్లి సారథి అయ్యాక అనేక సూచనలు చేశాడు’ అని అన్నాడు.