మహీకి అతనిపై నమ్మకం లేకకాదు.. | MS Dhoni has not lost faith in R Ashwin, says Ajit Agarkar | Sakshi
Sakshi News home page

మహీకి అతనిపై నమ్మకం లేకకాదు..

May 10 2016 1:36 PM | Updated on Sep 3 2017 11:48 PM

మహీకి అతనిపై నమ్మకం లేకకాదు..

మహీకి అతనిపై నమ్మకం లేకకాదు..

రైజింగ్ పుణె సూపర్జెయింట్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కొన్ని ఐపీఎల్ మ్యాచ్ల్లో ఆఫ్ స్పిన్నర్ అశ్విన్కు పూర్తి కోటా ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వలేదు.

రైజింగ్ పుణె సూపర్జెయింట్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కొన్ని ఐపీఎల్ మ్యాచ్ల్లో ఆఫ్ స్పిన్నర్ అశ్విన్కు పూర్తి కోటా ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వలేదు. దీంతో అశ్విన్పై ధోనీకి విశ్వాసం లేదా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే అలాంటిదేమీ లేదని టీమిండియా మాజీ పేసర్ అజిత్ అగార్కర్ చెబుతున్నాడు. అశ్విన్పై ధోనీ నమ్మకం కోల్పోలేదని, మ్యాచ్ పరిస్థితులే కారణమని చెప్పాడు.

'ముంబై వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్తో పుణె ఆడింది. వాంఖడే పిచ్ సీమర్లకు అనుకూలిస్తుంది. కాబట్టి ఈ మ్యాచ్లో అశ్విన్ బౌలింగ్ చేయాల్సిన అవసరం లేదు. చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్లు (చెన్నై సూపర్ కింగ్స్ తరపున) ఆడినపుడు అక్కడి వికెట్ స్పిన్కు సహకరిస్తుంది కాబట్టి అశ్విన్కు ఎక్కువ అవకాశం ఇచ్చారు. ఇతర వేదికల్లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి' అని అగార్కర్ అన్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement