'ఆ క్రికెటర్ స్థానాన్ని భర్తీ చేయడం కష్టం' | McCullum's retirement will leave big hole in NZ cricket, says david Warner | Sakshi
Sakshi News home page

'ఆ క్రికెటర్ స్థానాన్ని భర్తీ చేయడం కష్టం'

Feb 12 2016 6:41 PM | Updated on Sep 3 2017 5:31 PM

'ఆ క్రికెటర్ స్థానాన్ని భర్తీ చేయడం కష్టం'

'ఆ క్రికెటర్ స్థానాన్ని భర్తీ చేయడం కష్టం'

అంతర్జాతీయ క్రికెట్లో తనదైన ముద్రవేసిన న్యూజిలాండ్ క్రికెటర్ బ్రెండన్ మెకల్లమ్ రిటైర్మెంట్ నిజంగా పూడ్చలేనేదేనని ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ అభిప్రాయపడ్డాడు.

వెల్లింగ్టన్: అంతర్జాతీయ క్రికెట్లో తనదైన ముద్రవేసిన న్యూజిలాండ్ క్రికెటర్ బ్రెండన్ మెకల్లమ్ రిటైర్మెంట్ నిజంగా పూడ్చలేనిదని ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ అభిప్రాయపడ్డాడు. ఆ తరహా ఆటగాడ్ని వెతికిపట్టుకోవడం న్యూజిలాండ్కు కష్టసాధ్యమన్నాడు. అటు బ్యాట్స్ మెన్గానే కాదు, ఇటు అనుభవంలోనూ మెకల్లమ్ స్థానాన్ని భర్తీ చేయడం న్యూజిలాండ్ కచ్చితంగా సవాలేనని వార్నర్ పేర్కొన్నాడు. గతంలో  కివీస్ జట్టులో కీలక పాత్ర పోషించిన స్టెఫెన్ ఫ్లెమింగ్, డానియల్ వెటోరీలు వీడ్కోలు తీసుకున్నప్పుడు కూడా ఆ లోటును తిరిగి పూడ్చడం వారికి సాధ్యం కాలేదన్నాడు. ఆయా ఆటగాళ్లు వారి బ్యాటింగ్ తో పాటు, వారు నాయకత్వంలోనూ తమదైన మార్కును సృష్టించారన్నాడు.

 

ఇదే తరహాలో మెకల్లమ్ కెప్టెన్ గా ఉన్నప్పట్నుంచి జట్టును ముందుండి నడిపించిన తీరు అభినందనీయమన్నాడు. ఇలా బహుముఖ పాత్రల్లో మెరిసిన మెకల్లమ్ లోటును పూడ్చడం వారికి కష్టమన్నాడు. ఆటలో వివాదాలకు దూరంగా ఉండే మెకల్లమ్ ఒక గ్రేట్ జెంటిల్మెన్ గా వార్నర్ అభివర్ణించాడు. ఇటీవల వన్డేల నుంచి తప్పుకున్న మెకల్లమ్.. ఆస్ట్రేలియాతో రెండు టెస్టుల సిరీస్ అనంతరం మెకల్లమ్ వీడ్కోలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement