పిల్లలతో కలిసి కోహ్లి గల్లీ క్రికెట్‌

Kohli Spotted Playing Gully Cricket Ahead Of Indore Test - Sakshi

ఇండోర్‌: మరో రెండు రోజుల్లో బంగ్లాదేశ్‌తో ఇండోర్‌లో జరుగనున్న తొలి టెస్టుకు టీమిండియా సిద్ధమవుతుండగా జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కొంతమంది పిల్లలతో సరదాగా గడిపాడు. ఆ పిల్లలతో కలిసి గల్లీ క్రికెట్‌ ఆడుతూ మురిసిపోయాడు. తన బాల్యపు ఛాయల్ని గుర్తు చేసుకుంటూ పిల్లలతో కలిసి క్రికెట్‌ను ఆస్వాదించాడు. అదే సమయంలో షాట్లు కొట్టి మరీ అలరించాడు. మరొకవైపు పిల్లలతో కలిసి పరుగులు పెట్టాడు. తర్వాత పిల్లలకు బౌలింగ్‌ కూడా చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు కోహ్లి విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే. గత జనవరి నుంచి తీరక లేకుండా క్రికెట్‌ ఆడుతున్న తరుణంలో కోహ్లి విశ్రాంతి తీసుకున్నాడు. తన తీరిక సమయాన్ని భార్య అనుష్క శర్మతో కలిసి కోహ్లి గడిపాడు. ఈ సెలబ్రెటీ జంట తమ హాలీడే ట్రిప్‌ను భుటాన్‌లో ఎంజాయ్‌ చేశారు. అయితే టెస్టు సిరీస్‌లో భాగంగా తిరిగొచ్చిన కోహ్లి.. తొలి మ్యాచ్‌కు రెడీ అవుతున్నాడు. టెస్టు సిరీస్‌కు సారథిగా తిరిగి పగ్గాలు చేపట్టడానికి సన్నద్ధమయ్యాడు. మొదటి టెస్టు గురువారం ఇండోర్‌లో ఆరంభం కానుండగా, రెండో టెస్టు నవంబర్‌22వ తేదీన ప్రారంభం కానుంది. ఈడెన్‌ గార్డెన్‌లో జరుగనున్న రెండో టెస్టును డే అండ్‌ నైట్‌ టెస్టుగా నిర్వహించనున్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top