కార్తికేయన్‌కు మూడో స్థానం | Karthikeyan Third place | Sakshi
Sakshi News home page

కార్తికేయన్‌కు మూడో స్థానం

Apr 20 2015 1:49 AM | Updated on Sep 3 2017 12:32 AM

కార్తికేయన్‌కు మూడో స్థానం

కార్తికేయన్‌కు మూడో స్థానం

ఆరంభంలో కాస్త వెనుకబడ్డా కీలక సమయంలో పుంజుకున్న భారత రేసింగ్ డ్రైవర్ నారాయణ్ కార్తికేయన్... సుజుకా సర్క్యూట్‌లో ఆదివారం జరిగిన సూపర్ ఫార్ములా చాంపియన్‌షిప్‌లో మూడో స్థానంలో నిలిచాడు.

సూపర్ ఫార్ములా చాంపియన్‌షిప్
 సుజుకా: ఆరంభంలో కాస్త వెనుకబడ్డా కీలక సమయంలో పుంజుకున్న భారత రేసింగ్ డ్రైవర్ నారాయణ్ కార్తికేయన్... సుజుకా సర్క్యూట్‌లో ఆదివారం జరిగిన సూపర్ ఫార్ములా చాంపియన్‌షిప్‌లో మూడో స్థానంలో నిలిచాడు. 43 ల్యాప్‌ల ఈ రేసులో కార్తికేయన్ 1:14.29 సెకన్ల టైమింగ్‌తో లక్ష్యాన్ని చేరాడు. ఫార్ములావన్ కాకుండా సింగిల్ సీటర్ సిరీస్‌లో పొడియం (టాప్-3) చేరడం భారత డ్రైవర్‌కు ఇదే తొలిసారి.
 
 రెండో గ్రిడ్ నుంచి ప్రధాన రేసును మొదలుపెట్టిన కార్తికేయన్ తొలి ల్యాప్ ముగిసేసరికి మూడు స్థానాలు వెనుకబడ్డాడు. అయితే తర్వాత అద్భుతమైన టైమింగ్‌తో రేసులో దూసుకుపోయాడు. ఆండ్రీ లోటెరర్ 1:14.01 సెకన్లతో అగ్రస్థానంలో నిలువగా, కజుకి నకజిమా 1:14.10 సెకన్లతో రెండో స్థానాన్ని సాధించాడు. ఈ విజయంపై కార్తికేయన్ సంతృప్తిని వ్యక్తం చేశాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement