జోష్నా సంచలనం | Joshna Chinappa stuns former World No. 1 to win Richmond Open | Sakshi
Sakshi News home page

జోష్నా సంచలనం

Apr 21 2014 1:43 AM | Updated on Sep 2 2017 6:17 AM

జోష్నా సంచలనం

జోష్నా సంచలనం

భారత అగ్రశ్రేణి స్క్వాష్ క్రీడాకారిణి జోష్నా చినప్ప సంచలనం సృష్టించింది. రిచ్‌మండ్ ఓపెన్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచింది. తద్వారా తొమ్మిదోసారి మహిళల స్క్వాష్ అసోసియేషన్ (డబ్ల్యుఎస్‌ఏ) టూర్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.

 రిచ్‌మండ్ ఓపెన్ టైటిల్ సొంతం
 ఫైనల్లో మాజీ నంబర్‌వన్‌పై గెలుపు
 
 రిచ్‌మండ్ (అమెరికా): భారత అగ్రశ్రేణి స్క్వాష్ క్రీడాకారిణి జోష్నా చినప్ప సంచలనం సృష్టించింది. రిచ్‌మండ్ ఓపెన్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచింది. తద్వారా తొమ్మిదోసారి మహిళల స్క్వాష్ అసోసియేషన్ (డబ్ల్యుఎస్‌ఏ) టూర్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
 
 భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో ప్రపంచ 21వ ర్యాంకర్ జోష్నా 11-9, 11-5, 11-8తో ప్రపంచ మాజీ చాంపియన్, మాజీ నంబర్‌వన్ రాచెల్ గ్రిన్‌హమ్ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించింది. గ్రిన్‌హమ్‌తో తలపడిన ఆరు పర్యాయాల్లో భారత క్రీడాకారిణి గెలవడం ఇదే మొదటిసారి. అలాగే గతవారం టెక్సాస్ ఓపెన్‌లో ఆమె చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకున్నట్లయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement