జోష్నాకు స్క్వాష్ వరల్డ్ టూర్ టైటిల్ | Joshna Chinappa clinches Winnipeg Squash title | Sakshi
Sakshi News home page

జోష్నాకు స్క్వాష్ వరల్డ్ టూర్ టైటిల్

Feb 4 2014 12:40 AM | Updated on Sep 2 2017 3:18 AM

జోష్నాకు స్క్వాష్ వరల్డ్ టూర్ టైటిల్

జోష్నాకు స్క్వాష్ వరల్డ్ టూర్ టైటిల్

భారత స్క్వాష్ క్రీడాకారిణి జోష్నా చినప్ప తన కెరీర్‌లో తొలిసారి మహిళల స్క్వాష్ అసోసియేషన్ (డబ్ల్యూఎస్‌ఏ) వరల్డ్ టూర్ టైటిల్‌ను సాధించింది.

విన్నిపెగ్ (కెనడా): భారత స్క్వాష్ క్రీడాకారిణి జోష్నా చినప్ప తన కెరీర్‌లో తొలిసారి మహిళల స్క్వాష్ అసోసియేషన్ (డబ్ల్యూఎస్‌ఏ) వరల్డ్ టూర్ టైటిల్‌ను సాధించింది. విన్నిపెగ్ వింటర్ క్లబ్ ఓపెన్ ట్రోఫీలో భాగంగా ఇక్కడ జరిగిన ఫైనల్లో జోష్నా 11-13, 11-8, 11-5, 3-11, 12-10తో హెబా ఎల్ టొర్కీ (ఈజిప్ట్)పై చెమటోడ్చి నెగ్గింది. టైటిల్ కోసం ఇద్దరు హోరాహోరీగా తలపడ్డారు. దీంతో ప్రతీ గేమ్ సుదీర్ఘ ర్యాలీలకు దారితీసింది. చివరకు ప్రపంచ 27వ ర్యాంకర్ జోష్నా ప్రత్యర్థిపై పైచేయి సాధించి తొలి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. మొత్తం మీద భారత్ ఖాతాలో వరుసగా ఇది రెండో డబ్ల్యూఎస్‌ఏ వరల్డ్ టూర్ టైటిల్ కావడం విశేషం. గతేడాది దీపికా పల్లికల్ ఈ టైటిల్ గెలుచుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement