
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ యువ ఆటగాడు జీవన్ నెదున్‌చెజియాన్ వరుసగా రెండో అంతర్జాతీయ టోర్నమెంట్‌లో రన్నరప్‌గా నిలిచాడు. అమెరికాలో జరిగిన సవన్నా ఏటీపీ చాలెంజర్ టోర్నీలో జీవన్–ఎన్రిక్ లోపెజ్ పెరెజ్ (స్పెయిన్) జంట ఫైనల్లో ఓడిపోయింది.
లూక్ బామ్‌బ్రిడ్జ్ (బ్రిటన్)–అకీరా సాంటిలన్ (ఆస్ట్రేలియా) ద్వయంతో జరిగిన ఫైనల్లో జీవన్–ఎన్రిక్ జోడీ 2–6, 2–6తో పరాజయం పాలైంది. రన్నరప్‌గా నిలిచిన జీవన్–ఎన్రిక్‌లకు 2,700 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. లక్షా 81 వేలు)తోపాటు 48 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. గతవారం తలాసీ ఓపెన్ టోర్నీలోనూ జీవన్–ఎన్రిక్ జోడీ ఫైనల్లో ఓడిపోయింది.