నకముర హ్యాట్రిక్‌ | Japan's biggest victory over Honduras | Sakshi
Sakshi News home page

నకముర హ్యాట్రిక్‌

Oct 9 2017 12:02 AM | Updated on Jun 15 2018 4:33 PM

Japan's biggest victory over Honduras - Sakshi

గువాహటి: ఫిఫా అండర్‌–17 ప్రపంచకప్‌లో జపాన్‌కు ఘనమైన ఆరంభం లభించింది. స్ట్రయికర్‌ కీటో నకముర హ్యాట్రిక్‌ గోల్స్‌ (22, 30, 43వ నిమిషాల్లో)తో చెలరేగడంతో ఆదివారం గ్రూప్‌ ‘ఇ’ విభాగంలో హోండురస్‌తో జరిగిన మ్యాచ్‌లో 6–1తో విజయం సాధించింది. జపాన్‌ అటాకింగ్‌ గేమ్‌ను ఎదుర్కోవడంలో హోండురస్‌ ఆటగాళ్లు పూర్తిగా విఫలమయ్యారు. ఆరంభం నుంచే చెలరేగిన జపాన్‌ ప్రత్యర్థి గోల్‌ పోస్టుపై దాడులకు దిగడంతో స్వల్ప వ్యవధిలోనే గోల్స్‌ నమోదయ్యాయి.

కుబో (45వ ని.), మియాషిరో (51వ ని.), సుజుకీ (90వ ని.) తలా ఓ గోల్‌ అందించారు. హోండురస్‌ నుంచి పలాకియోస్‌(36) ఏకైక గోల్‌చేశాడు. గ్రూప్‌ ‘ఇ’ ఇతర మ్యా చ్‌ల్లో ఫ్రాన్స్‌ 7–1 తేడాతో న్యూ కాలెడోనియాను.. గ్రూప్‌ ‘ఎఫ్‌’లో ఇంగ్లండ్‌ 4–0తో చిలీని ఓడించగా ఇరాక్, మెక్సికో జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ 1–1తో డ్రాగా ముగిసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement