భారత రెజ్లర్లకు 9 పతకాలు | Indian wrestlers 9 medals | Sakshi
Sakshi News home page

భారత రెజ్లర్లకు 9 పతకాలు

Feb 23 2016 12:53 AM | Updated on Sep 3 2017 6:11 PM

భారత రెజ్లర్లకు 9 పతకాలు

భారత రెజ్లర్లకు 9 పతకాలు

ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత కుస్తీ వీరులు తొమ్మిది పతకాలు సాధించారు.

న్యూఢిల్లీ: ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత కుస్తీ వీరులు తొమ్మిది పతకాలు సాధించారు. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో ముగిసిన ఈ ఈవెంట్‌లో పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో సందీప్ తోమర్ (57 కేజీలు) స్వర్ణ పతకం సొంతం చేసుకోగా... ఓంప్రకాశ్ వినోద్ కుమార్ (70 కేజీలు) రజత పతకాన్ని దక్కించుకున్నాడు. మహిళల విభాగంలో ప్రియాంక ఫోగట్ (55 కేజీలు) రజతం నెగ్గగా... వినేశ్ ఫోగట్ (53 కేజీలు), అనితా తోమర్ (63 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో హర్‌దీప్ సింగ్ (98 కేజీలు), గౌరవ్ శర్మ (59 కేజీలు), హర్‌ప్రీత్ సింగ్ (80 కేజీలు), నవీన్ (130 కేజీలు) కాంస్య పతకాలు సంపాదించారు. ఓవరాల్‌గా ఈ పోటీల్లో భారత్ ఏడో స్థానంలో నిలిచింది.

Advertisement
 
Advertisement
Advertisement