చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతో శనివారం జరిగిన ‘ఫైనల్’ వన్డేలో భారత్ 57 పరుగుల తేడాతో ఆసీస్‌పై ఘనవిజయం సాధించింది.
బెంగళూరు: చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతో శనివారం జరిగిన ‘ఫైనల్’ వన్డేలో భారత్ 57 పరుగుల తేడాతో ఆసీస్‌పై ఘనవిజయం సాధించింది. అంతకముందు 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 383 పరుగులు చేసిన భారత్ ఆసీస్‌కు 384 పరుగుల విజయలక్ష్యాన్ని ముందుంచింది. 384 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 45.1 ఓవర్లలో 326 పరుగులకే ఆల్ ఔటైంది. దీంతో ఈ సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది.
ఆసీస్ ఓపెనర్ ఫించ్ పేలవంగా ఆడి ఆదిలోనే తుస్సమనిపించాడు, హుగ్గీస్ 23 పరుగులు చేసి ఆశ్విన్ బౌలింగ్‌లో యువరాజ్ క్యాచ్ పట్టడంతో ఔట్ అయ్యాడు. ఆ తరువాత వచ్చిన హద్దీన్ 40 పరుగుల మోత పరవాలేదని అనిపించింది. హద్దీన్ రాక కొంతమేరకు ఆసీస్ జట్టులో ఉత్సాహం కనిపించినట్టే కనిపించి అంతలోనే ఆశ్వీన్ బౌలింగ్‌లో తుస్సమంది. అప్పటికే స్వల్పస్కోరు చేసినా ఆసీస్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆటగాళ్లు బెయిలీ 4, వోగస్ 4, పరుగలతో సింగల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఇక ఆసీస్ పని అయిపోయిందనుకున్న తరుణంలో మాక్స్‌వెల్ 60 పరుగుల టపాసుల మోత బాగా పేలి అంతలోనే తుస్సమని అనిపించాడు. ఆ తరువాత వచ్చిన వాట్సన్ 49, కల్టర్ నైల్ 3, మెకె 18 పరుగలకే ఒకరితరువాత ఒకరు వెనుతిరిగారు. ఫాల్కనర్ 116 పరుగులు చేయడంతో ఒక దశలో మ్యాచ్ భారత జట్టు చేజారుతుందని అనిపించినా, చివర్లో మాక్స్ వెల్ తో పాటు అతడు కూడా ఔట్ కావడంతో మ్యాచ్ తో పాటు సిరీస్ కూడా భారత వశమయ్యాయి.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఓపెనర్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ తనదైనా శైలిలో ధీటుగా ఆడుతూ 158 బంతుల్లో 12ఫోర్లు, 16 సిక్స్‌లతో 209 పరుగుల అధ్బుతమైన ఇన్నింగ్ ఆడి తొలి డబుల్ సెంచరీ పూర్తిచేశాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన.. మూడో బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు.