ఇండియా బ్యాటింగ్ వర్సెస్‌ పాక్ బౌలింగ్! | India vs Pakistan, Asia Cup 2016, experts opinion | Sakshi
Sakshi News home page

ఇండియా బ్యాటింగ్ వర్సెస్‌ పాక్ బౌలింగ్!

Feb 27 2016 3:33 PM | Updated on Sep 3 2017 6:33 PM

ఇండియా బ్యాటింగ్ వర్సెస్‌ పాక్ బౌలింగ్!

ఇండియా బ్యాటింగ్ వర్సెస్‌ పాక్ బౌలింగ్!

ఉపఖండం క్రికెట్ అభిమానులు ఎంత ఉత్కంఠగా ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న దాయాదుల క్రికెట్‌ సంగ్రామానికి మరికాసేపట్లో తెరలేవనుంది.

ఉపఖండం క్రికెట్ అభిమానులు ఎంత ఉత్కంఠగా ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న దాయాదుల క్రికెట్‌ సంగ్రామానికి మరికాసేపట్లో తెరలేవనుంది. ఆసియా కప్‌లో భాగంగా ఢాకా వేదికగా భారత్‌-పాకిస్థాన్‌ ట్వంటీ-20 మ్యాచ్‌ ఆడనున్నారు. రెండు టీమ్‌లు ఈ మ్యాచును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం.. చిరకాల ప్రత్యర్థిపై విజయం కోసం ఉవ్విళ్లూరుతుండటంతో ఈ పోరు హోరాహోరిగా జరుగడం ఖాయంగా కనిపిస్తుంది. ముఖ్యంగా బలంగా ఉన్న భారత్ బ్యాటింగ్, పాకిస్థాన్‌ బౌలింగ్ ఆటాక్ హోరాహోరీ పోరు జరుగడం ఖాయమని క్రికెట్ దిగ్గజాలు, మాజీ ప్లేయర్లు విశ్లేషిస్తున్నారు..

భారత బ్యాట్స్‌మన్‌ ఈ మధ్యకాలంలో చాలా స్థిరంగా ఆడుతున్నారు. కానీ మా వద్ద బలమైన బౌలింగ్‌ ఆటాక్‌ ఉంది. కాబట్టి మ్యాచ్‌ గొప్పగా జరిగే అవకాశముంది'
- షోయబ్ మాలిక్, పాకిస్థాన్ క్రికెటర్‌

'ఔను వాళ్ల వద్ద బలమైన బౌలింగ్ దాడి ఉంది. కానీ మేం మా బలాలపైనే ఎక్కువగా శ్రద్ధపెట్టాం'
- రోహిత్ శర్మ, టీమిండియా క్రికెటర్

'ఓపెనర్లను పెవిలియన్‌ పంపడం ద్వారా మొదటి ఆరు ఓవర్లను బాగా ఉపయోగించుకోవాలని మా ఫాస్ట్ బౌలర్లు భావిస్తున్నారు. అదే మా బలం కూడా'
- షాహిద్ ఆఫ్రిది, పాకిస్థాన్ క్రికెటర్‌

'పాకిస్థాన్ పేస్‌ ఆటాక్‌ను భారత బ్యాటింగ్ సమర్థంగా ఎదుర్కోగలదు. కానీ పాకిస్థాన్ భారత బౌలింగ్‌ దాడిని ఎదుర్కొనేంత సమర్థంగా కనిపించడం లేదు'
- సునీల్ గవస్కర్‌, భారత క్రికెటర్

'భారత్ ఆడుతున్న తీరు చూస్తేంటే.. ఈ మ్యాచులో వాళ్లే ఫేవరెట్స్‌ అని స్పష్టమవుతోంది'
- వసీం అక్రం, పాకిస్థాన్ క్రికెటర్‌

'టీ-20లో భారత్‌కు నంబర్ వన్ బౌలర్‌గా నెహ్రూ తనను తాను నిరూపించుకున్నాడు. అది టీమిండియాకు బలం కానుంది'
- జవగళ్ శ్రీనాథ్‌, భారత క్రికెటర్

'అశ్విన్‌ బాగా ఆడుతున్నంత మాత్రాన టీమిండియా హర్భజన్‌ సింగ్‌ను పక్కనపెట్టజాలదు'
- సక్లయిన్ ముస్తాక్‌, పాకిస్థాన్ స్పిన్నర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement