ఒత్తిడి పాకిస్థాన్‌పైనే..! | pressure will be on Pakistan, says Erapalli Prasanna | Sakshi
Sakshi News home page

ఒత్తిడి పాకిస్థాన్‌పైనే..!

Feb 27 2016 3:55 PM | Updated on Sep 3 2017 6:33 PM

ఒత్తిడి పాకిస్థాన్‌పైనే..!

ఒత్తిడి పాకిస్థాన్‌పైనే..!

టీ-20 మ్యాచులో ప్రత్యర్థి జట్టు పాకిస్థాన్‌పైనే ఎక్కువ ఒత్తిడి ఉండే అవకాశముందని భారత సీనియర్ క్రికెటర్ ఎర్రపల్లి ప్రసన్న అభిప్రాయపడ్డారు.

ఆసియా కప్‌లో భాగంగా ఢాకా వేదికగా జరుగనున్న టీ-20 మ్యాచులో ప్రత్యర్థి జట్టు పాకిస్థాన్‌పైనే ఎక్కువ ఒత్తిడి ఉండే అవకాశముందని భారత సీనియర్ క్రికెటర్ ఎర్రపల్లి ప్రసన్న అభిప్రాయపడ్డారు. 'టీమిండియా కూర్పు బాగుంది. జట్టు బలంగా ఉంది. కాబట్టి సహజంగానే పాక్‌పైనే ఒత్తిడి ఉండే అవకాశముంది' అని ఆయన విలేకరులతో పేర్కొన్నారు.

టాస్‌ గెలిస్తే బ్యాటింగే తీసుకోవాలి!
ఉపఖండం క్రికెట్ అభిమానుల అంచనాల మధ్య ప్రతిష్టాత్మకంగా మారిన దాయాదుల పోరులో టీమిండియా టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవడం ఉత్తమం అని సీనియర్ భారత క్రికెటర్ సయెద్ కిర్మాణీ సూచించారు. భారత్ మొదటి బ్యాటింగ్ చేస్తే 150కి పైగా స్కోరు చేయాలని, అంతకంటే తక్కువ స్కోరు అయితే ఛేజ్‌ చేయండం పెద్ద కష్టమేమి కాదని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement