భారత్‌కు ఎనిమిదో స్థానం | India upstaged by Ireland, finish 8th | Sakshi
Sakshi News home page

భారత్‌కు ఎనిమిదో స్థానం

Jul 23 2017 2:56 AM | Updated on Sep 5 2017 4:38 PM

మహిళల హాకీ వరల్డ్‌ లీగ్‌ (హెచ్‌డబ్ల్యూఎల్‌) సెమీఫైనల్స్‌ టోర్నమెంట్‌ను భారత జట్టు ఓటమితో ముగించింది.

జొహన్నెస్‌బర్గ్‌: మహిళల హాకీ వరల్డ్‌ లీగ్‌ (హెచ్‌డబ్ల్యూఎల్‌) సెమీఫైనల్స్‌ టోర్నమెంట్‌ను భారత జట్టు ఓటమితో ముగించింది. 7–8 స్థానాల కోసం శనివారం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారత్‌ 1–2 గోల్స్‌ తేడాతో ఐర్లాండ్‌ చేతిలో ఓడిపోయింది. దాంతో పది జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో భారత్‌ ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. 15వ నిమిషంలో గుర్జీత్‌ కౌర్‌ గోల్‌తో భారత్‌ 1–0తో ముందంజ వేయగా... ఐర్లాండ్‌ జట్టుకు 47వ నిమిషంలో క్యాథ్రీన్‌ ములాన్, 48వ నిమిషంలో లిజీ కాల్విన్‌ ఒక్కో గోల్‌ చేసి గెలిపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement