భారత్‌కు ఎనిమిదో స్థానం
జొహన్నెస్‌బర్గ్: మహిళల హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్) సెమీఫైనల్స్ టోర్నమెంట్‌ను భారత జట్టు ఓటమితో ముగించింది. 7–8 స్థానాల కోసం శనివారం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారత్ 1–2 గోల్స్ తేడాతో ఐర్లాండ్ చేతిలో ఓడిపోయింది. దాంతో పది జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో భారత్ ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. 15వ నిమిషంలో గుర్జీత్ కౌర్ గోల్‌తో భారత్ 1–0తో ముందంజ వేయగా... ఐర్లాండ్ జట్టుకు 47వ నిమిషంలో క్యాథ్రీన్ ములాన్, 48వ నిమిషంలో లిజీ కాల్విన్ ఒక్కో గోల్ చేసి గెలిపించారు.