పాక్ జట్టు కంటే ధోనీసేనే బెటర్ | India far better than Pakistan, says Kapil Dev | Sakshi
Sakshi News home page

పాక్ జట్టు కంటే ధోనీసేనే బెటర్

Feb 27 2016 10:43 AM | Updated on Sep 3 2017 6:33 PM

పాక్ జట్టు కంటే ధోనీసేనే బెటర్

పాక్ జట్టు కంటే ధోనీసేనే బెటర్

పాకిస్తాన్ క్రికెట్ జట్టుతో పోలిస్తే టీమిండియా మెరుగ్గా ఉందని మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నాడు.

న్యూఢిల్లీ: పాకిస్తాన్ క్రికెట్ జట్టుతో పోలిస్తే టీమిండియా మెరుగ్గా ఉందని మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నాడు. ఆసియా కప్లో భాగంగా శనివారం పాకిస్తాన్తో జరిగే మ్యాచ్లో వికెట్ బౌలింగ్కు అనుకూలిస్తే.. ధోనీసేన 170 పరుగులు చేయాల్సిన అవసరం లేదని 130 చాలని కపిల్ అభిప్రాయపడ్డాడు.

'1980ల్లో పాకిస్తాన్ జట్టు పటిష్టంగా ఉండేది. ఆ తర్వాత పరిస్థితి మారింది. గత 15 ఏళ్లుగా భారత్ అన్ని ఫార్మాట్లలో బలోపేతమైంది. పాక్ బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉన్నా భారత టి-20 జట్టే మెరుగైనది. ఢాకా మ్యాచ్లో పాకిస్తాన్ పేసర్లకు వికెట్ అనుకూలించి, బౌన్స్ లభిస్తే.. భారత బ్యాట్స్మెన్ జాగ్రత్తగా ఆడాలి. పాక్ బ్యాటింగ్ లైనప్ను చూస్తే ధోనీసేన భారీ స్కోరు చేయాల్సిన అవసరం లేదు. 130 పరుగులు చాలు' అని కపిల్ దేవ్ అన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement