
విరాట్ కోహ్లి
టీమిండియా సారథి, రన్ మెషీన్ విరాట్ కోహ్లి మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఐర్లాండ్‌తో నేడు జరిగే తొలి టీ20లో ఆ రికార్డును అందుకోనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ టీ20లో 53 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 1,983 పరుగులు చేశాడు. మరో 17 పరుగులు చేస్తే.. టీ20లో 2వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. ఈ ఘనతను ఇప్పటికే ఇద్దరు ఆటగాళ్లు అందుకున్నారు. న్యూజిలాండ్‌కు చెందిన మార్టిన్ గుప్టిల్, బ్రెండన్ మెకలమ్‌లు ఈ ఘనతను సాధించారు. అంతేకాక ఐర్లాండ్‌తో జరిగే టీ20 మ్యాచ్‌లో ఈ రికార్డును అందుకుంటే.. అత్యంత వేగంగా 2వేల పరుగులు చేసిన రికార్డును కోహ్లి నెలకొల్పనున్నాడు.
ప్రస్తుతం టీ20 పరుగుల జాబితాలో కోహ్లి నాలుగో స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గుప్టిల్ 73 మ్యాచ్‌లో 2,271 పరుగులు చేసి మొదటిస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత బ్రెండన్ మెకలమ్ (70 మ్యాచ్‌లో) 2,140 పరుగులతో, పాకిస్తాన్ ఆటగాడు షోయబ్ మాలిక్ (91 మ్యాచ్‌లు)1,989 పరుగులతో రెండు మూడు స్థానాల్లో ఉన్నారు. విరాట్ కోహ్లి వాళ్ల కంటే ముందుగానే ఈ రికార్డును అందుకునే అవకాశం ఉంది.