నా వీడియోను షేర్‌ చేసిన సచిన్‌కు థాంక్స్‌

I Want To Thank Sachin, 13 Years Disabled Kid - Sakshi

న్యూఢిల్లీ: ఇటీవల మద్దారామ్‌ అనే 13 ఏళ్ల యువకుడు నేలపై పాకుతూనే క్రికెట్‌ ఆడుతున్న వీడియో ఒకటి బాగా వైరల్‌ అయ్యింది. ఇది మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ను సైతం  కదిలించింది. ఆ వీడియోను సచిన్‌ టెండూల్కర్‌ స్వయంగా షేర్‌ చేశాడు. దంతేవాడ జిల్లాలోనే కంటేకల్యాన్‌ అనే చిన్న గ్రామంలో కాళ్ల చచ్చుబడ్డ మద్దారామ్‌ క్రికెట్‌పై ఉన్న ప్రేమను చాటుకున్నాడు. పాకుతూనే పరుగులు తీశాడు. ఆ చిన్నారి మానసిక స్థైర్యానికి సచిన్ ముగ్ధుడయ్యారు.

‘ఈ స్ఫూర్తిదాయకమైన వీడియోతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించండి. ఈ వీడియో నన్ను ఎంతో కదలించింది. మీలోను అదే భావన కలిగిస్తుందని ఆశిస్తున్నా అంటూ ట్వీట్ చేశారు. నెటిజన్లను కదిలించిన ఈ వీడియో  వైరల్‌ అయ్యింది. దీనిపై ఆ యువకుడు మాట్లాడుతూ.. ‘ నా క్రికెట్‌ దేవుడు సచిన్‌కు థాంక్స్‌. నాకు సచిన్‌ సారే స్ఫూర్తి. నా వీడియోను స్వయంగా ఆయన షేర్‌ చేసినందుకు చాలా ఆనంద పడటమే కాదు..  గర్వంగా కూడా ఫీలవుతున్నా. మా ఊరికి రావాలని సచిన్‌ను కోరుతున్నా’ అని ఆ యువకుడు పేర్కొన్నాడు. ఇక డాక్టర్‌ కావాలనేదే తన జీవిత లక్ష్యమన్నాడు. ఆ యువకుడ్ని బ్లాక్‌ ఎడ్యూకేషన్‌ ఆఫీసర్‌ గోపాల్‌ పాండే కలిశారు. ఇక సదరు డిపార్ట్‌మెంట్‌ అతడికి క్రికెట్‌  కిట్‌ను అందించారు. మద్దా రామ్‌ స్నేహితులకు కూడా క్రికెట్‌ కిట్‌ను ప్రదానం చేశారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top