
ఐపీఎల్‌ను టీవీల్లో కూడా చూడటం లేదు: పుజారా
దేశమంతా క్రికెట్ అభిమానులు ఐపీఎల్ ఫీవర్‌లో ఉండగా టెస్టు క్రికెటర్ పుజారా మాత్రం ఐపీఎల్‌ను టీవీలో కూడా చూడడం లేదని
రాజ్‌కోట్: దేశమంతా క్రికెట్ అభిమానులు ఐపీఎల్ ఫీవర్‌లో ఉండగా టెస్టు క్రికెటర్ పుజారా మాత్రం ఐపీఎల్‌ను టీవీలో కూడా చూడడం లేదని చెబుతున్నాడు. వేలంలో పుజారాను ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేయని విషయం తెలిసిందే.
‘ప్రాక్టీస్ లేకుంటే ఫిట్‌నెస్ శిక్షణతో రోజంతా గడిచిపోతుంది. 24 గంటలు క్రికెట్‌కే అంకితం కాలేము. సాయంత్రాలు కుటుం బం... లేకపోతే స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాను. అందుకే టీవీలో ఐపీఎల్ చూడలేకపోతున్నాను’ అని పుజారా తెలిపాడు.