హైదరాబాద్‌ బుల్స్‌ ఘన విజయం  | Hyderabad Bulls Beat Gadwal Team In Kabaddi League | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ బుల్స్‌ ఘన విజయం 

Feb 28 2020 10:02 AM | Updated on Feb 28 2020 10:02 AM

Hyderabad Bulls Beat Gadwal Team In Kabaddi League - Sakshi

హైదరాబాద్‌: తెలంగాణ ప్రీమియర్‌ కబడ్డీ లీగ్‌ సీజన్‌–3లో హైదరాబాద్‌ బుల్స్‌ జట్టు ఘనవిజయం సాధించింది. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయ భాస్కర్‌ రెడ్డి స్టేడియంలో గురువారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ బుల్స్‌ 40–28తో గద్వాల్‌ గ్లాడియేటర్స్‌పై గెలుపొందింది. 12 రైడ్‌ పాయింట్లు సాధించిన హైదరాబాద్‌ బుల్స్‌ ఆటగాడు ప్రసాద్‌ ‘బెస్ట్‌ రైడర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా... నీలేశ్‌ (గద్వాల్‌ గ్లాడియేటర్స్‌) ‘బెస్ట్‌ డిఫెండర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా ఎంపికయ్యారు. మరో మ్యాచ్‌లో వరంగల్‌ వారియర్స్‌ జట్టు 43–37తో కరీంనగర్‌ కింగ్స్‌పై గెలుపొందింది.

ఈ మ్యాచ్‌లో జి. రాజు 17 రైడ్‌ పాయింట్లతో చెలరేగాడు. ట్యాకిల్‌లో కరీంనగర్‌ కింగ్స్‌ ప్లేయర్‌ నిఖిల్‌ గౌడ్‌ రాణించాడు. మ్యాచ్‌ ఆరంభం నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన వరంగల్‌ వారియర్స్‌ జట్టు తొలి అర్ధభాగంలో 20–12తో ముందంజ వేసింది. అయితే రెండో అర్ధభాగంలో కరీంనగర్‌ కింగ్స్‌ 25–23తో ఆధిక్యంలోకి వచి్చంది. తర్వాత పుంజుకున్న వరంగల్‌ జట్టు ప్రత్యర్థికి అవకాశమివ్వకుండా దూసుకెళ్లింది. ‘బెస్ట్‌ రైడర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా రాజు... ‘బెస్ట్‌ డిఫెండర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిఖిల్‌ గౌడ్‌ నిలిచారు. మూడో మ్యాచ్‌లో నల్లగొండ ఈగల్స్‌ జట్టు 45–43తో మంచిర్యాల టైగర్స్‌పై నెగ్గింది. ‘బెస్ట్‌ రైడర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచిన మల్లికార్జున్‌ 21 రైడ్‌ పాయింట్లతో అదరగొట్టాడు. పి. రమేశ్‌ ‘బెస్ట్‌ డిఫెండర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు.    

Advertisement
 
Advertisement
Advertisement