ఐసీఎస్‌ఈ, ఐఎస్‌సీ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్‌లో ఫ్యూచర్‌కిడ్స్ స్కూల్ బాస్కెట్‌బాల్ జట్లు సత్తాచాటాయి. జూనియర్, సీనియర్ బాలికల విభాగంలో టైటిల్స్‌ను కైవసం చేసుకున్నాయి.
సాక్షి, హైదరాబాద్: ఐసీఎస్‌ఈ, ఐఎస్‌సీ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్‌లో ఫ్యూచర్‌కిడ్స్ స్కూల్ బాస్కెట్‌బాల్ జట్లు సత్తాచాటాయి. జూనియర్, సీనియర్ బాలికల విభాగంలో టైటిల్స్‌ను కైవసం చేసుకున్నాయి. బుధవారం హబ్సిగూడలోని సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ మైదానంలో జరిగిన బాస్కెట్‌బాల్ ఫైనల్లో జూనియర్ బాలికల విభాగంలో ఫ్యూచర్ కిడ్స్ జట్టు 23- 18 తేడాతో లయోలా స్కూల్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఫ్యూచర్‌కిడ్స్ జట్టు తరఫున భావన 12పాయింట్లు, ధాత్రి 10 పాయింట్లు సాధించారు. లయోలా స్కూల్ జట్టులో శల్య 10 పాయింట్లతో ఆకట్టుకుంది. ఉత్కంఠ రేకెత్తించిన సీనియర్ బాలికల ఫైనల్లో ఫ్యూచర్ కిడ్స్ జట్టు 34-33తో అభ్యాస స్కూల్ జట్టును ఓడించింది. ఫ్యూచర్ కిడ్స్ జట్టులో ధావని (16), ఆస్థా (10)... అభ్యాస స్కూల్ తరఫున నిహారిక (10), నూరిన్ (6) రాణించారు.