‘ఆల్‌టైమ్‌ శ్రీమంతుడు’ జోర్డాన్‌

'Forbes' is the top of the list of players - Sakshi

‘ఫోర్బ్స్‌’ ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానం

న్యూయార్క్‌: అత్యధిక ధనవంతమైన ఆల్‌టైమ్‌ గ్రేటెస్ట్‌ క్రీడాకారుల జాబితాలో ఫుట్‌బాల్‌ ప్లేయరో,  దిగ్గజ క్రికెటరో లేడు. ‘ఫోర్బ్స్‌’ మేగజైన్‌ విడుదల చేసిన శ్రీమంతులైన ఆటగాళ్లలో అమెరికా బాస్కెట్‌బాల్‌ లెజెండ్‌ మైకేల్‌ జోర్డాన్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. రిటైరైన ఈ 54 ఏళ్ల దిగ్గజం ఆర్జన మొత్తం రూ. 11, 881 కోట్లు (1.85 బిలియన్‌ డాలర్లు) కావడం విశేషం.. ఆ తర్వాత రెండు, మూడు స్థానాల్లో గోల్ఫర్లు టైగర్‌ వుడ్స్‌ (రూ. 10, 918 కోట్లు; 1.7 బిలియన్‌ డాలర్లు), అర్నాల్డ్‌ పాల్మర్‌ (రూ.8991 కోట్లు; 1.4 బిలియన్‌ డాలర్లు) ఉన్నారు.

నాలుగో స్థానం కూడా గోల్ఫర్‌దే! జాక్‌ నిక్‌లాస్‌ రూ.7707 కోట్ల (1.2 బిలియన్‌ డాలర్లు) ఆదాయంతో ఉన్నాడు. ఫార్ములావన్‌ లెజెండ్‌ మైకేల్‌ షుమాకర్‌ (రూ. 6422 కోట్లు; ఒక బిలియన్‌ డాలర్లు) టాప్‌–5 జాబితాలో ఉన్నాడు. ఫుట్‌బాలర్లు డేవిడ్‌ బెక్‌హామ్, రొనాల్డో, లియోనల్‌ మెస్సీ, బాక్సర్లు మెవెదర్, పకియావో, టెన్నిస్ట్‌ గ్రేటెస్ట్‌ రోజర్‌ ఫెడరర్‌ టాప్‌–25 అథ్లెట్‌ శ్రీమంతుల్లో ఉన్నారు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top