ఫుట్‌బాల్ ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత జట్టుకు మరో పరాజయం ఎదురైంది.
ఫుట్‌బాల్ ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీ
టెహ్రాన్: ఫుట్‌బాల్ ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత జట్టుకు మరో పరాజయం ఎదురైంది. గురువారం గ్రూప్ ‘డి’లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆసియా నంబర్‌వన్ ఇరాన్ 4-0తో ఘనవిజయం సాధించింది. రెండో రౌండ్‌లో భారత్ తమ చివరి మ్యాచ్‌ను 29న కొచ్చిలో తుర్కెమెనిస్తాన్‌తో ఆడుతుంది.
ఇప్పటికే ప్రపంచకప్‌కు అర్హత సాధించే అవకాశాలు కోల్పోయిన భారత్ ఈ నామమాత్రమైన ఆసియా జోన్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లోనూ ఏమాత్రం పోరాడలేక పోయింది. ఇరాన్ తరఫున ఎహ్‌సాన్ హజీ సఫీ (33, 66వ నిమిషాల్లో) పెనాల్టీ కిక్‌ల ద్వారా రెండు గోల్స్ చేయగా సర్దార్ అజమౌన్ (61), అలిరెజా జహాన్ బక్ష్ (78) చెరో గోల్ సాధించారు.