జీవన్‌ జంట సంచలనం | Egan International Tennis Tournament Jeevan | Sakshi
Sakshi News home page

జీవన్‌ జంట సంచలనం

Jun 27 2017 2:15 AM | Updated on Sep 5 2017 2:31 PM

జీవన్‌ జంట సంచలనం

జీవన్‌ జంట సంచలనం

ఎగాన్‌ ఇంటర్నేషనల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో భారత ఆటగాడు జీవన్‌ నెదున్‌చెజియాన్‌ డబుల్స్‌లో సంచలన విజయంతో ముందడుగు వేశాడు.

ఈస్ట్‌బోర్న్‌ (ఇంగ్లండ్‌): ఎగాన్‌ ఇంటర్నేషనల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో భారత ఆటగాడు జీవన్‌ నెదున్‌చెజియాన్‌ డబుల్స్‌లో సంచలన విజయంతో ముందడుగు వేశాడు. మ్యాట్‌ రీడ్‌ (ఆస్ట్రేలియా)తో కలిసి అన్‌సీడెడ్‌ జోడీగా బరిలోకి దిగిన జీవన్‌ తొలి రౌండ్లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ డబుల్స్‌ చాంపియన్స్‌ను కంగుతినిపించాడు. సోమవారం జరిగిన తొలిరౌండ్లో భారత్‌–ఆసీస్‌ ద్వయం 6–3, 3–6, 10–7తో మూడో సీడ్‌ రియాన్‌ హరిసన్‌ (అమెరికా)–మైకేల్‌ వీనస్‌ (కివీస్‌) జంటపై విజయం సాధించింది.

మరోవైపు ప్రతిష్టాత్మక ‘వింబుల్డన్‌’ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ పురుషుల డబుల్స్‌ మెయిన్‌ ‘డ్రా’లో జీవన్‌కు చోటు దక్కింది. డబుల్స్‌లో 95వ ర్యాంకర్‌ జీవన్‌కు తనకన్నా మెరుగైన ర్యాంకర్‌ డొనాల్డ్‌సన్‌ (65వ ర్యాంకు) జతయ్యాడు. వింబుల్డన్‌ నిబంధనల ప్రకారం ఇద్దరు భాగస్వాముల ర్యాంకులు కలిపితే 160కి మించరాదు. సరిగ్గా కటాఫ్‌ ర్యాంకు (95+65=160)తో భారత ఆటగాడు గట్టెక్కాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement