పోలా..! అదిరిపోలా.. ఈ క్యాచ్‌! | Sakshi
Sakshi News home page

Published Sun, Nov 4 2018 1:58 PM

Du Plessis Takes Brilliant Catch In South Africa Vs Australia - Sakshi

పెర్త్‌ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికా కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ అద్భుత క్యాచ్‌తో ఔరా అనిపించాడు. సూపర్‌మ్యాన్‌లా గాల్లోకి ఎగిరి బంతినందుకున్నాడు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లో చోటుచేసుకున్న ఈ అద్భుత ఫీట్‌కు మైదానంలోని ప్రేక్షకులు మైమరిచిపోయారు. ఆటగాళ్లైతే సంభ్రమాశ్చర్యానికి లోనయ్యారు. (చదవండి: అయ్యో తాహీర్‌.. ఎంత పనాయే!

ఇక ఈ మ్యాచ్‌తో పేసర్‌ డేల్‌ స్టేయిన్‌ తన రీఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. అతనేసిన రెండో ఓవర్‌లోనే రెండు కీలక వికెట్ల పడగొట్టి ఆసీస్‌ పతనాన్ని శాసించాడు. తొలుత ట్రావిస్‌ హెడ్‌ను ఔట్‌ చేసిన స్టేయిన్‌ అనంతరం క్రీజులోకి వచ్చిన డీఆర్సీ షార్ట్‌ను డుప్లెసిస్‌ అద్భుత ఫీల్డింగ్‌తో డకౌట్‌గా పెవిలియన్‌ చేర్చాడు. స్టెయిన్‌ వేసిన ఫుల్‌ లెంగ్త్‌ను డీఆర్సీ షాట్‌ భారీ షాట్‌కు ప్రయత్నించగా.. ఆ బంతి బ్యాట్‌కు ఎడ్జ్‌ తీసుకుని గాల్లోకి లేచింది. సెకండ్‌ స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న డుప్లెసిస్‌ అంతే వేగంతో సూపర్‌ మ్యాన్‌లా గాల్లోకి ఎగిరి క్యాచ్‌ అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ మ్యాచ్‌లో సఫారీ బౌలర్లు పెహ్లుక్వాయో మూడు, ఎంగిడి, స్టెయిన్‌, తాహిర్‌లు రెండేసి వికెట్లతో చెలరేగడంతో ఆసీస్‌ 152 పరుగులకే కుప్పకూలింది. (చదవండి: వారెవ్వా.. టీ20ల్లోనూ డబుల్‌ సెంచరీ!)

Advertisement

తప్పక చదవండి

Advertisement