
కేరళ బ్లాస్టర్స్‌కు చుక్కెదురు
గువాహటి: యువ ఆటగాళ్ల జోరు ముందు సీనియర్ ఆటగాళ్లు తేలిపోయారు. అనుభవజ్ఞులతో కూడిన భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు చెందిన...
1-0తో నార్త్‌ఈస్ట్ యునెటైడ్ ఎఫ్‌సీ గెలుపు
గువాహటి: యువ ఆటగాళ్ల జోరు ముందు సీనియర్ ఆటగాళ్లు తేలిపోయారు. అనుభవజ్ఞులతో కూడిన భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు చెందిన కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీ జట్టు ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)ను ఓటమితో ప్రారంభించింది. అటు మైదానంలో పాదరసంలా కదిలిన నార్త్‌ఈస్ట్ యునెటైడ్ ఎఫ్‌సీ 1-0తో నెగ్గి ఐఎస్‌ఎల్‌లో బోణీ చేసింది. సోమవారం ఇరు జట్ల మధ్య ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో కేరళ అటాకింగ్ గేమ్‌కు ప్రాధాన్యమివ్వగా... చక్కటి డిఫెన్స్‌తో నార్త్‌ఈస్ట్ ఆకట్టుకుంది. ముఖ్యంగా నార్త్‌ఈస్ట్ గోల్‌కీపర్ అలెగ్జాండ్రోస్ జొర్వాస్ ప్రత్యర్థి ప్రయత్నాలకు అడ్డుగోడలా నిలిచాడు. 33వ నిమిషంలో కేరళ గోల్‌కీపర్ డేవిడ్ జేమ్స్ సూపర్ డైవ్‌తో గోల్ ప్రయత్నాన్ని అడ్డుకున్నా ప్రథమార్ధం మరికొద్ది క్షణాల్లో (45వ నిమిషం) ముగుస్తుందనగా డేవడ్ గెయిటే ఇచ్చిన పాస్‌ను కోకే నేర్పుగా కుడి వైపునకు తన్ని గోల్‌గా మలిచాడు. ద్వితీయార్ధంలో కేరళ కాస్త జోరు పెంచి దాడులకు దిగినా ఫలితం లేకపోయింది.