తొలిరౌండ్‌లోనే బోపన్న జంట ఓటమి | Bopanna pair Knocked out from paris open | Sakshi
Sakshi News home page

తొలిరౌండ్‌లోనే బోపన్న జంట ఓటమి

Nov 2 2017 10:48 AM | Updated on Nov 2 2017 10:48 AM

Bopanna pair Knocked out from paris open - Sakshi

పారిస్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో రోహన్‌ బోపన్న (భారత్‌)–పాబ్లో క్యువాస్‌ (ఉరుగ్వే) జంట తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. పారిస్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో బోపన్న–క్యువాస్‌ ద్వయం 2–6, 6–7 (7/9)తో యువాన్‌ సెబాస్టియన్‌ కాబల్‌–రాబర్ట్‌ ఫరా (కొలంబియా) జోడీ చేతిలో ఓడిపోయింది. 77 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో బోపన్న–క్యువాస్‌ జంటకు ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్‌ చేసే అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైంది. తమ సర్వీస్‌ను మాత్రం రెండుసార్లు కోల్పోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement